PAYMENT, RECEIPT, CONTRA (Telugu Explanation)

  1. Payment :(key: F5) కంపెనీ దేనికైనా సరే పేమెంట్ చేస్తే ఈ వౌచెర్ లో ఎంటర్ చేస్తారు. భవిష్యత్తు లో పేమెంట్ చేయాల్సి ఉంటె ఇందులో ఎంటర్ చేయరు. పేమెంట్ ఖచ్చితం గా జరిగితేనే ఈ వౌచెర్ ఎంటర్ చేస్తారు. ఉదాహరణకు కంపెనీ పవర్ బిల్ కోసం చెల్లించింది అనుకుందాం ..ఇందులో ఎంటర్ చేస్తారు. మన కంపెనీ..మరొక కంపెనీ కి చెల్లించింది అనుకుందాము. ఇందులో ఎంటర్ చేస్తారు. చేసిన పేమెంట్ నగదు రూపం లో, చెక్కు రూపం లో లేదా dd రూపంలో లేదా ఆన్లైన్ ద్వారా లేదా ఇంకా ఎలా అయిన పర్వాలేదు. మొత్తానికి పేమెంట్ జరిగితేనే ఇందులో ఎంటర్ చేస్తారు.
  2. Receipt : (KEY: F6) కంపెనీ కి డబ్బులు వస్తే ఈ వౌచెర్ లో ఎంటర్ చేస్తారు. ఒక ఆదాయం కావచ్చు. ఒక పార్టీ దగ్గర నుంచి డబ్బులు రావొచ్చు. అప్పుడు ఈ వౌచెర్ ఎంటర్ చేయాలి. భవిష్యత్తు లో డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఈ వౌచెర్ రాదు. వచ్చిన డబ్బులు … నగదు రూపం లో, చెక్కు రూపం లో లేదా dd రూపంలో లేదా ఆన్లైన్ ద్వారా లేదా ఇంకా ఎలా అయిన పర్వాలేదు. మొత్తానికి కంపెనీ కి డబ్బులు వస్తేనే ఇందులో ఎంటర్ చేస్తారు.
  3. Contra : (KEY: F4): కంపెనీ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ ని డిపాజిట్ చేసినా , బ్యాంకు ఎకౌంటు నుంచి విత్ డ్రా చేసినా ఇందులో ఎంటర్ చేస్తారు. అంతే కాకుండా బ్యాంకు నుంచి బ్యాంకు కి మరియు నగదు నుంచి నగదు కి బదీలీ (ట్రాన్స్ఫర్) జరిగినా ఈ వౌచెర్ లో ఎంటర్ చేస్తారు. క్యాష్ నుంచి క్యాష్ కి ట్రాన్స్ఫర్ అంటే… కంపెనీ మెయిన్ క్యాష్ నుంచి చిల్లర నగదు కి ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుందాము . అప్పుడు ఈ వౌచెర్ ఎంటర్ చేస్తారు.